17, జనవరి 2022, సోమవారం

విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ - 3 - చారీజీ భావాలు

విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ - 3 - చారీజీ భావాలు
 

పరమపూజ్య  పార్థసారథి  రాజగోపాలాచారీజీ,  సహజమార్గ  గురుపరంపరలోని  మూడవ  గురువుగారు, ఏప్రిల్  30, 2005న ఈ  విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ అనే  దివ్యసందేశాల సమాహారాన్ని  మొట్టమొదటిసారిగా,  పూజ్య  బాబూజీ  మహారాజ్  106వ జన్మదినోత్సవ  సందర్భంగా  తిరుప్పూరు,  తమిళనాడులో  విడుదల  చేయడం  జరిగింది. ఆ  రోజే  ప్రజల సమక్షంలో  ఈ  సందేశమాలికకు  విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ అని అద్భుతమైన  నామకరణం చేయడం జరిగింది. ఆ  తరువాత వారు పరమపదించే వరకూ  ఇచ్చిన  అనేక ప్రసంగాల్లో  గ్రంథాన్ని  అనేక  రకాలుగా  కీర్తించడం, అభ్యాసుల  సాధనలో  ఈ  గ్రంథం  యొక్క  ప్రాముఖ్యతను తెలియజేయడం  జరిఫగింది.  వాటిల్లో  కొన్నిటిని  ఇక్కడ  మనం  పరిశీలిద్దాం.

బుక్ ఫ్యూచర్ - భవిష్యత్తు గ్రంథం: 

(మార్చి 30, 2005 న కొలకొతాలో ఈ  గ్రంథాన్ని  గురించిన  ప్రకటన  చేస్తూ హిందీలో  ఇచ్చిన  ప్రసంగంలోని  అంశాలు) 

"ముద్రణలో  ఉన్న  ఈ  గ్రంథం  ఎవ్వరూ  వ్రాసినది  కాదు.  కాబట్టి  దీనికి  గ్రంథ కర్త పేరు  ఉండదు.  ఈ  గ్రంథంలోని  విషయం  ఏమిటో  ఈ  రోజుకీ  కుడా  నాకు  తెలియదు.  కాని  ఎంతో  నమ్మకంతో  గత  మూడు  సంవత్సరాలుగా  ఈ  గ్రంథం  కోసం  పదివేల రూపాయల  విరాళం  ఇస్తూ  ఉన్నారు. గ్రంథం  ఇప్పటికి  ముద్రణలో  ఉంది.  ఈ  గ్రంథం  మీరు  కావాలనుకుంటే  ఫౌంండేషన్ కి పది  వేల  రూపాయలు  విరాళంగా  ఇవ్వవలసి  ఉంటుంది." 

"మీ  జీవితంలో  ఈ  అరుదైన భవిష్యత్  గ్రంథం  ఉంటుంది.  మీ  భవిష్యత్తు ఈ  గ్రంథంతో  ముడిపడుంది.  దీన్ని  గురించి  మళ్ళీ  మీకిక  చెప్పను  ఎందుకంటే  నేను  ఇక్కడికి  డబ్బు  అడగాలని రాలేదు. మీకందరికీ  ఏదో  చెయ్యాలని  వచ్చాను." 

"ఈ  గ్రంథాన్ని  మీరు  ప్రేమించవచ్చు  లేక  ద్వేషంతో అవతల  పారేయవచ్చు  కూడా,  నేను  మీకు  ముందే  హెచ్చరిస్తున్నాను.  ఇది  జీవితంలాంటిది -  సంతోషంగానైన  జీవించవచ్చు  లేక  దుఃఖంతోనైనా  జీవించవచ్చు.  దీన్ని  చదివినవాడు  అంగీకరించవచ్చు,  అంగీకరించకపోనూ  వచ్చు.  కొంత  మంది  సంస్థను  వదిలి పెట్టి  వెళ్ళిపోయే  అవకాశం  కూడా  ఉంది.  ఈ అవకాశం  ఉంది  ఎందుకంటే  ఇది ముక్కలుగా  చేసే  కత్తిలాంటిది; కత్తి  ఎప్పుడూ  రెండు  వస్తువులను  కలపదు. కత్తులు  వకలపవు.  కత్తులెప్పుడైనా  వస్తువులను  కలిపిన  దాఖలాలున్నాయా? ఈ  గ్రంథం  కోసేది  దేన్ని?  మీ  తెలివిని (జ్ఞానాన్ని),  మీ  విశ్వాసాన్ని  కోసేస్తుంది; ఏదొకదాన్ని అవతల  పారేస్తుంది;  ఏదో  ఒక్కటే  ఉంటుంది." 

శ్రీరామచంద్ర మిషన్  బైబిల్: 

( 30, ఏప్రిల్ 2005 న  తిరుప్పూరులో ఇచ్చిన  ప్రసంగమ్లోని  అంశాలు)

"నేనిప్పుడు  ఒక  పుస్తకం  విడుదల  చెయ్యవలసిన  ముఖ్యమైన  కార్యం  ఒకటుంది. ఇప్పటి  వరకూ  ఇది  రహస్యంగా  కాదు  గాని, పవిత్రంగా  తెలియకుండా  ఉంచడం  జరిగింది. దీన్ని  చూడాలంటే  అది  జన్మించాలి.  భారతదేశంలో  బిడ్డ  పుట్టే  ముందు  ఆడా-మగా  అని  చూడటం  నిషిద్ధం;  ఎందుకంటే  ఈ  ఆధునిక  సాకేతిక  పరిజ్ఞానంతో  ఎన్నో చెయ్యాకూడని పనులు చేస్తున్నారు.  మన మాస్టర్ల  పట్ల ఎంతో  భక్తి  కలిగిన, అర్థం  చేసుకోగలిగేటువంటి సహజ ప్రజ్ఞ  కలిగినవారి కోసం,  ఆధ్యాత్మికత  అంటే  శ్రద్ధగలవారి కోసం  ఈ  గ్రంథాన్ని  ఆవిష్కరించడం  నాకెంతో  ఆనందాన్ని  కలిగిస్తోంది.  నిన్న  ఎవరో  బహుశా  ఎ.పి,దురై  అనుకుంటా,  మనం కమ్యూనికేషన్ రంగంలో ఒక  నూతన  తరానికి  నాంది  పలుతుకున్నాం అనుకుంటా,  మరింత  ఉన్నతమైన  టెక్నాలజీలోకి  అడుగు  పెడుగుతున్నాము  ఈ  గ్రంథావిష్కరణతో  అనడం  జరిగింది;  కాని  ఇది  హై టెక్నాలజీ కాదు - ఇది అత్యున్నత  కోవకు  చెందిన  సహజప్రజ్ఞ. దీన్ని  చదివినప్పుడు  ఇందులో  ఏముందో  మీకర్థమవుతుంది. ఇది  మన  శ్రీరామచంద్ర  మిషన్ యొక్క  బైబిల్ అవుతుంది భవిష్యత్తులో. జనం  చదువుతారు,  ఒక్కొక్క  పేజీ  చదువుకుంటారు ఎందుకంటే  ఇదేమీ  నవల  కాదు,  చదివి అవతల  పారేయడానికి."

సహజమార్గ  వేదం: (మార్చి 25, 2009 న విశాఖపట్నంలో  ఇచ్చిన  ప్రసంగంలోని  అంశాలు)

"నిజానికి  దీన్ని  సహజమార్గ  వేదంగా అభివర్ణించాలి. మొదటి  సంపుటి  వస్తోంది, బహుశా 5  సంపుటాల  వరకూ  విడుదలవుతాయి  కనీసం."

".... చదవండి, చదవడం  చాలా  అవసరం; కాని  కేవలం  చదివితే  సరిపోదు.  చదవండి,  జీర్ణం  చేసుకోండి,  ధ్యానించండి (శ్రవణం, మననం, నిధిధ్యాసనంనిధిధ్యాసనం) కొన్ని  వేల  సవత్సరాలకు  పూర్వమే  యోగశాస్త్రం  చెప్పిన  మెట్లు -  వినడం,  అర్థం  చేసుకోవడం, ధ్యానించడం ద్వారా  మనలో  భాగం  చేసేసుకోవడంచేసేసుకోవడం."

అత్యున్నత  కోవకు  చెందిన  సహజ ప్రజ్ఞ (ఇంట్యూషన్  ఆఫ్ ది  హైయ్యెస్ట్  ఆర్డర్): 

(విస్పర్స్ ఫ్రమ్  ది  బ్రైటర్ వరల్డ్ మొదటి  సంపుటిలోని  ఇన్విటేషన్ నుండి గ్రహించిన  కొన్ని  అంశాలు)

ఎంత  చదువుకున్నవారైనా,  ఎంత  వికాసం  చెందినవారైనా  వినియోగించే  సంచార  సాధనలైనా ఏమిటి  అంటే  వాక్కు, వాసన, చూపు, స్పర్శలే.  ఇవన్నీ  మనం  జన్మతః ఉన్న ఇంద్రియ  వ్యవస్థలను వినియోగించుకొనే  స్థూలమైన  స్థాయిలో  వినియోగించే సంచార  సాధనలు.  వీటిని  అన్ని  రకాల  స్థాయిల్లో  ఉండే  జీవులు  వాడుతూ  ఉంటాయి -క్రిమికీటకాదులు,  పక్షులు, జంతువులు, మనుషులు అన్నీ  వాడుతూ  ఉంటాయి.  ముఖ్యంగా  మనిషి  క్రింది స్థాయిలో  ఉన్న  జీవులు  వాసనను  ఎక్కువగా  వినియోగిస్తాయి. "

"మనం  అర్థం  చేసుకోవలసినదేమిటంటే,  ఈ  బహిర్గతమైన శక్తులన్నిటికీ  కూడా  సహజంగా  వికాసం  చెందిన  ఈ  అవయవాలు  చాలా  అవసరం; ఈ  తరంగాలను, గ్రహించడానికి  అవసరం; చూపును  వెలుగుగాను, విన్నదాన్ని  శబ్దంగాను,  అనుభూతి  చెందేది  వేది అని  తర్జుమా  చేయడానికి  ఈ  ఇంద్రియాలు  అవసరం. "

"కేవలం  ఆలోచన  ద్వారానే  ప్రసరించగలిగితే? దురదృష్టవశాత్తు,  ఎటువంటి  యాంత్రిక  పరికరాలతో  గాని,  ఎటువంటి  ఎలక్ట్రానిక్  పరికరాలతో  గాని  పని  లేకుండా  మనౌషులు  పరస్పరం  సమాచారాన్ని  అందించుకోవచ్చని  ఇంకా మనుషులు అంగీకరించవలసి  ఉంది. ఆలోచన  తాను  ఉన్నచోటు  నుండి  ఎంత  దూరమైనా,  విశ్వంలో  ఎక్కడికైనా  తృటిలో  ప్రయాణించగలదని  అందరూ  అంగీకరిస్తారు."

""మన  లోకం  గాకుండగా  ఇతర  లోకాలతో  సంభాషించడం  సాధ్యమన్న  విషయంలో నాకూ  కూడా  కొంత  సందేహం  ఉండేదని  పాఠకులకు  నేనిక్కడ  నమ్మకం  కలిగిస్తున్నాను.  కాని  నేను  ఆ  విధంగా  కొనసాగకుండా  ఉండటానికి  నా  మాస్టరు  వద్ద  నుండి  అందిన  సందేశాల్లో  అనేక  సూక్ష్మాలు దాగి  ఉన్నాయి. ఇప్పటికీ  అప్పుడప్పుడు  నాకు  సందేహం  కలుగుతూనే  ఉంటుంంం  కాని  అటువంటి  సందేహాలు వచ్చిన వెంటనే  విడిచి  వెళ్ళిపోతున్నాయి  కూడా అని చెప్పాలి.  చిత్తశుద్ధిగా  సందేహం  అనడంలో  ఎటువంటి  బిడియమూ  అక్కర్లేదు; దీన్ని  నా  గురుదేవులు  బాబూజీ  సందేహం  కాదు,  ప్రశ్న అనాలనేవారు.  కాని  ఈ  సందేశాలను  గురించిన  ఔన్నత్యాన్ని  గురించి అంతరంగంలో  ఇన్ని   దొరికినప్పటికీ  కూడా  ఇంకా  అనుమానించడమూ,  నాస్తికుడిలా  ఉండటం  అనేది  నిజంగా  సిగ్గుపడవలసిన  విషయము,  విషాదకరమూ  కూడా  అవుతుంది.  కాబట్టి  నేను  పాఠకులకు  చేసే  విజ్ఞప్తి  ఏమిటంటే,  మీరు  ముందే  ఏర్పరచుకున్న  అభిప్రాయాలను,  దురభిమానాలను,  ప్రక్కకు  పెట్టి, ఈ  గ్రంథంలో  ఉన్నది  చదవండి,  చదివినదాన్ని  మీ  హృదయంతో  బేరీజు  వేసుకోండి,  నిర్ధారణకు  రండి,  ఎందుకంటే  నిజాన్ని  యథాతథంగా  ఋజువు  చేసే  గొప్ప  పరికరం  కేవలం  హృదయమే  కాబట్టి."

"ఒక  మీడియం (మాధ్యమం) తన  వృతి  ఇదిగాకపోయినా,  నా  గురుదేవుల  ఆజ్ఞల  మేరకు  ఆమే  అందుకున్నట్లువంటి  నాకు  అందుబాటులోకి  తీసుకువచ్చింది.  ఆమే  సహజమార్గ  సాధన  అనుసరించేటువంటి  ఒక  సోదరి. నేను  నాలుగు  మూలాల  నుండి  ఈ  సందేశాలను  అందుకున్నాను.  అవన్నీ  నా  ప్రియతముడు  నన్ను ఉద్దేశించి అందించినవే.  అవన్నీ  కూడా  సందేహించడానికి  తావే  లేని సందేశాలు."

పాఠకులు, భూమ్మీద  నుండి  గాక  ఇతర లోకాల  నుండి  అందుకున్న ఈ  విస్పర్  సందేశాలను  చదువుతున్నప్పుడు తమలో ఉన్న  తమ  నాస్తిత్వాన్ని,  సందేహాలను,  బహుశా  కోపాన్ని  కూడా  ప్రక్కన  పెట్టి చదవాలని  ప్రార్థిస్తున్నాను. వీటిల్లో  నన్ను  ఉద్దేశించినవి, కొన్ని  ఇతర అభ్యాసులనుద్దేశించినవి, మరికొన్ని  ఎవరినీ  ప్రత్యేకించి  ఉద్దేశించినవి  కాదు  గాని  మొత్తం  మానవాళిని  ఉద్దేశించినవి  ఉన్నాయి.  ద్వేషం చేత,  ఉద్దేశపూర్వకమైన  హింస  ద్వారా,  మతపరమైన అంధత్వం  వల్ల భయభ్రాంతులకు  గురవుతున్న  మానవాళికి  ఓదార్పును  కలిగించి,  నూతన ఉత్సాహాన్ని  కలిగించే  సందేశాలు  ఇందులో  చోటు చేసుకున్నాయి."

హి-మెయిల్స్: 

(ఫిబ్రవరి 2, 2013 న తిరుచిరాపల్లిలో ఇచ్చిన సందేశంలోని  కొన్ని అంశాలు)

నేను  ఈ  సందేశాలను  ఈమెయిల్స్ అని  గాకుండగా  హి-మెయిల్స్ అంటాను; వీటికి  మనం  హృదయంతో  స్పందిస్తాం. వాటితో  ఒక రోజు  అనుసంధానమవుతాం. మరి  మనం  ఏ  లోకానికి  వెళ్ళవలసిన  అవసరం  లేదు  కూడా;  ఇక్కడికి  కూడా  తిరిగి  రానవసరం  లేదు.  మనం  మూలాన్నే  చేరుకుంటాం -  అక్కడి  నుండి  అంతా  కనిపిస్తుంది, అంతా  గ్రహించగలుగుతాం, సమస్తమూ  అందుబాటులో  ఉంటాయి, అక్కడ  పని చేసేది  ఆ  పరతత్త్వమే  కూడా."

కూడా." (సశేషం - తరువాయి భాగంలో  విస్పర్స్  చదివే విధానాన్ని గురించి  తెలుసుకుందాం) 



భక్త హనుమాన్ జయంతి

    భక్త హనుమాన్ జయంతి  హనుమజ్జయంతి ప్రతి సంవత్సరమూ చైత్ర శుక్ల పౌర్ణమినాడు ప్రపంచమంతటా ఉన్న హిందువులు జరుపుకుంటారు. శ్రీరామాయణ కావ్యంలో హను...